కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బిడ్డల చదువుకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో ఉన్న 19 గురుకులాలను స్వరాష్ట్రంలో 327కు పెంచామని, ఒక్క గురుకులాల పైనే ఏటా 880 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దేశంలోని 200 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే బీసీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి సీఎం అనుమతి ఇచ్చారని, ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశమై పథకం పేరు, లోగో, విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. తాజాగా మరో వరం ప్రకటించారని, ఇక నుంచి ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థుల తరహాలోనే పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 34వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
విద్యతోనే వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని సీఎం బలంగా నమ్ముతున్నారని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు విద్యారంగంలో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బీసీలు చదువుకునే అవకాశం లేకపోయిందని, కానీ, స్వరాష్ట్రంలో మాత్రం బీసీ విద్యార్థులకు సీఎం పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఇప్పటికే ఓవర్సీస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, తాజాగా దేశంలోని దేశంలోని 200 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారని చెప్పా రు. తాజాగా ప్రీమెట్రిక్ విద్యార్థులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు, వసతులను పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కల్పించేందుకు అనుమతి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం అమలవుతున్న అన్ని విద్యాశాఖలను ఒకే గొడుకు కిందికి తెస్తామని చెప్పారు.
గురుకులాలపైనే ఏటా 800 కోట్లు ఖర్చు
గత ప్రభుత్వాల హయాంలో బీసీలకు తీరని అన్యా యం జరిగిందని మంత్రి లెక్కలతో సహా వివరించారు. నాడు తెలంగాణ లో కేవలం 19 గురుకులా లు మాత్రమే ఉండేవని, అందులో 7,580 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారని చెప్పారు. నిజానికి జనాభాలో 56 నుంచి 59 శాతం ఉన్న తమకు విద్యారంగంలో సముచిత స్థానం గత ప్రభుత్వాలు కల్పించలేదన్నారు. తమ బిడ్డలకు చ దువుకునే అవకాశాలు కల్పించాలని, అందుకోసం ఎక్కువ గురుకులాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాటిపాలకులు పట్టించుకోలేదన్నారు. తమ బీసీ బిడ్డలను కులవృత్తులకు మా త్రమే పరిమితం చేసే కుట్రలు జరిగాయన్నారు. ఫ లితంగా చదువుకోవాలన్న ఆశ ఉన్నా, ఆర్థిక స్థోమ త లేక చాలా మంది చదువులు మానేయాల్సి వ చ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగంలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పా రు. 327 గురుకులాలు ఏర్పాటు చేసి, అందులో 1,87,508 మందికి విద్యను అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకోసం ఏటా 880 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని స్పష్టం చేశారు. జిల్లాకో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి.. వెనుకబడిన బిడ్డల జీవితాల్లో సీఎం వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త పథకం
బీసీ బిడ్డలు చదువుకునేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలుచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ఇప్పటికే విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల దాకా సాయం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విదేశి విద్యానిధి తరహాలోనే దేశంలోని 200 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా 2 లక్షల దాకా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ప్రకటించారు.
పథకం పేరుతోపాటు లోగో, విధివిధానాలను ఆవిష్కరించేందుకు ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా పదివేల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని, మున్ముందు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకుంటూ వెళ్తామన్నారు.
పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వసతులు
దేశంలోని ప్రముఖ జాతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఇది గొప్ప పథకమని సంతోషిస్తుండగానే బీసీ విద్యార్థులకు మరో వరం ప్రకటించారని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వర్తింపచేస్తూ జీవోను జారీ చేశారని, తద్వా రా రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వీరికి ప్ర స్తుతం భోజన, వసతి మాత్రమే ఉందన్నారు. బుధవారం విడుదలైన జీవో ప్రకారం ఇక నుంచి ప్రీ మెట్రిక్ విద్యార్థుల మాదిరిగానే కాస్మోటిక్ చార్జీలతోపాటు ఇతర అన్ని సదుపాయాలు పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వర్తిస్తాయని తెలిపారు. ప్రీమెట్రిక్ విద్యార్థులకు ఉండే సౌకర్యాలను పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వర్తింపజేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.
అన్ని పథకాల్లో ప్రాధాన్యం
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోనూ బీసీలకు మెజార్టీ వాటా అందిస్తున్నారని చెప్పారు. కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువైన స్థలాల్లో 42 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నదన్నారు. ఆర్థిక సాయం చేస్తూ కులవృత్తుల పునర్జీవం పోస్తున్నారని ప్రశంసించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పాల్గొన్నారు.