Telangana Formation Day | చిగురుమామిడి, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిగురుమామిడి మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ జంగా రమణారెడ్డి, మండల ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి సందీప్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆకవరం భవాని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శశిధర్ శర్మ, ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు గందె రజిత, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ జయప్రద, పోలీస్ స్టేషన్లో ఎస్సై పృధ్విధర్ గౌడ్, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తాసిల్దార్ ముద్ధసాని రమేష్, బీఆర్ఎస్ మండల కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య జెండాను ఎగరవేశారు.
ఈ వేడుకల్లో సింగిల్ విండో కార్యాలయ సీఈఓ నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆకవరం శివప్రసాద్, పెనుకుల తిరుపతి, బెజ్జంకి లక్ష్మణ్, ఎండీ సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, అన్ని శాఖల ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.