కార్పొరేషన్/కొత్తపల్లి, ఫిబ్రవరి 24: కరీంనగర్ ప్ర జలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీం‘నగరం’లోని తీగలగుట్టపల్లిలో 2.50 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్‌లో 3కోట్లతో చేపట్టనున్న రెండు సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి మా ట్లాడారు. సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఈ పరిసర ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య పరిష్కారం కావడంతోపాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కొత్త స బ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గతంలో ఈ ప్రాంతంలో రైతులు విద్యుత్ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కానీ స్వరాష్ట్రం లో రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. మూడు నెలల్లోగా సబ్స్టేషన్ల నిర్మా ణ పనులు పూర్తి చేసి వినియోగం తేవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో తమ వంతు సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి గంగులను ఖాజీపూర్ గ్రామస్తులు శా లువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు కాశెట్టి లావణ్యా శ్రీనివాస్, కోలగాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, సర్పంచ్ ఉల్లెందుల రాజమ్మ, విద్యుత్ శాఖ ఎస్ఈ వడ్లకొండ గంగాధర్, డీఈ రాజం, ఏడీఈ రాజు, ఎన్ అంజయ్య, వేణు, ఏఈ శ్రీనివాస్‌గౌడ్, సంపత్, సాయి, బీఆర్ఎస్ నాయకుడు సోమినేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.