Coal Mine Workers | గోదావరిఖని : ఈనెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో జరిగే ఒకరోజు సమ్మెను సింగరేణిలో నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికుల హక్కులను దృష్టిలో ఉంచుకొని సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ 11 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు యజమాన్యానికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాల్సిన అవకాశం ఏర్పడింది అని సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని సింగరేణి సంస్థలో పెర్క్స్ పై విధిస్తున్న ఇన్కంటాక్స్ ను రద్దు చేయాలని 1 జులై 2016 నుంచి అర్హులైన రిటైర్డ్ కార్మికులకు రూ.20 లక్షలు గ్రాట్యూటీ చెల్లించాలని ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న సమ్మెను కార్మికులు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపెల్లి రవికుమార్, చల్లా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.