Sand dump | మెట్పల్లి రూరల్, మే 28: మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు వంద ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
ఈమేరకు సంబంధిత ఇసుక డంపును తహసీల్దార్ సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ ఉమేశ్ ఉన్నారు.