జగిత్యాల : జిల్లాలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల (Digital Skills ) పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి కె. రాము( Ramu) కోరారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాల, ఈశా హైస్కూల్, కోరుట్ల రాష్మిధర్ తేజ కాలేజ్, కోరుట్ల గర్ల్స్ హై స్కూల్, మెట్పల్లి జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టుతున్న డిజిటల్ లిట్రసీలో ఉపాధ్యాయులు స్మార్ట్ క్లాస్‌రూమ్స్‌లో టెక్నాలజీని ఉపయోగించి బోధనను మరింత ఆసక్తికరంగా చేయాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లైబ్రరీలు, ఈ-లెర్నింగ్ వనరులను ఉపయోగించగలుగుతారని పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయని వివరించారు. ట్రైనింగ్‌లో భాగంగా కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లపై ఉపాధ్యాయులకు శిక్షణను అందించామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రాజేష్ , కోర్స్ డైరెక్టర్లు బండారి మధు, జయసింహ రావు , నర్సింగరావు , ప్రసాద్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.