Dharmaram | ధర్మారం, ఆగస్టు 13: తమ అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ డీ శ్రీనివాస్‌కు ఆ సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి పిలుపుమేరకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కి చేరడానికి వారు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, జీవో 25 సవరించాలని, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే ఎంప్లాయి హెల్త్ స్కీం విధివిధానాలు వెంటనే రూపొందించి హెల్త్ కార్డు విడుదల చేయాలని, సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు పూర్తిగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో యుఎస్ పి సి నాయకులు ఎస్ మల్లారెడ్డి, కె. కనకయ్య, ఏవి శేషగిరి రావు,ఈ. శ్రీనివాస్,డి. సుభాషిని, మెహముద ఖాతున్ తదితరులు పాల్గొన్నారు.