Sagara Sangham | వీణవంక : శ్రీరాములపేట సగర సంఘం అభివృద్ధికి ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూతనందించారు. గ్రామానికి చెందిన సగర (ఉప్పర) కులస్తులు ఇటీవల గ్రామంలో కమ్యునిటీ హాల్ నిర్మించుకునేందుకు కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలం కొనుగోలు కోసం, సగరుల అభివృద్ధికి తమ వంతు సహాయంగా గ్రామానికి చెందిన విద్యావంతులు, ఉపాధ్యాయులైన సగర కులానికి చెందిన దేవునూరి కుమారస్వామి సగర, దేవునూరి రఘు సగర, కుర్మిండ్ల సారయ్య సగర మగ్గురు కలిసి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందుబాటులో ఉన్న సగర కమిటీ, బంధువులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆ గ్రామ సగర సంఘం కమిటీ సభ్యులు దేవునూరి రాజేందర్ సగర, కుర్మిండ్ల మల్లయ్య సగర మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమ కోరికను మన్నించి సంఘం అభివృద్ధికి వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దేవునూరి కుమారస్వామి సగర, దేవునూరి రఘు సగర, కుర్మిండ్ల సగరను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు, మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్, కుర్మిండ్ల తిరుపతయ్య సగర, సాంబయ్య, జనార్ధన్, ప్రభాకర్, శ్రీనివాస్, అశోక్, రాజుకుమార్ తదితర సగర సంఘం సభ్యులు పాల్గొన్నారు.