చెరువులు నిండుగ రైతన్న ఇంట పండుగ
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కాళేశ్వర జలాలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా జిల్లెల్ల చెరువులు పూర్తిగా నిండి, దిగువకు పారుతున్నాయి.
- కాళేశ్వర జలాలతో తంగళ్లపల్లి మండలంలో తటాకాలకు జీవం
- పూర్తిగా నిండి మత్తడి దూకుతున్న పెద్దచెరువు, పటేల్ చెరువు
- సంబురపడుతున్న కర్షకులు lసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
సిరిసిల్ల రూరల్, మార్చి 23: మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కాళేశ్వర జలాలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా జిల్లెల్ల చెరువులు పూర్తిగా నిండి, దిగువకు పారుతున్నాయి. దీంతో పటేల్ చెరువు మత్తడి వద్ద సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో జిల్లెల్ల ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు సంబురాలు జరుపుకున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీపై పూలు చల్లుతూ, పాలతో అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, కాళేశ్వర జలాలతో తమ గ్రామ చెరువులు నింపుతున్నారని, దశాబాబ్దాల కళ నేరవేరిందని ఆనందపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణ పడి ఉంటామని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, సింగిల్‌విండో చైర్మన్ కోడూరి భాస్కర్‌గౌడ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కొమ్మెటి రాజిరెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ పబ్బతి విజేందర్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ అబ్బాడి అనిల్‌రెడ్డి, ఉపసర్పంచ్ సతీశ్‌రెడ్డి, అబ్బాడి తిరుపతిరెడ్డి, ఎండీ రషీద్, సతీశ్, శ్రీను, గణేశ్, బండి శ్రీను, ప్రమోద్, బాలయ్య, శ్రావణ్, బాగయ్య, కొత్త పల్లి శ్రీనివాస్, అఫ్రోజ్, మాట్ల శంకర్, బీఆర్ఎస్ బోయ వినోద, కనకవ్వ, దేవవ్వ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

