Athletics | జగిత్యాల, జూలై 19 : ఈనెల 18న మెట్టుపల్లిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెల్చుకున్నారు.
బాలుర విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో టెన్త్‌క్లాస్ విద్యార్థి పీ యశ్వంత్ కుమార్ మొదటి స్థానం, 60 మీటర్ల పరుగు పందెంలో 8వ తరగతి విద్యార్థి డీ మోక్షిత్ ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో 8వ తరగతి విద్యార్థిని ఎం మనీషా ద్వితీయ స్థానం, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం రమ్య తృతీయ స్థానంలో నిలిచారు.
ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను పాల్గొన్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ రామానుజన్, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధిక, తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, జయశ్రీ, ఉమారాణి, రజాక్, ఇంతియాజ్, రాజేందర్, కమలాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అశోక్, సత్యనారాయణ, కుమార్ తదితర ఉపాధ్యాయులు అభినందించారు.