Challur | వీణవంక, జనవరి 28 : వీణవంక మండలంలోని చల్లూరు సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను తహసీల్దార్ దాసరి రాజమల్లు బుధవారం పరిశీలించారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను, భక్తులకు ధర్శనానికి కావాల్సిన సౌకర్యాలను తహసీల్దార్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.
పక్కనే మానేరువాగు ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటించాలని జాతర నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించారు. గద్దెల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బొంగోని రాజయ్య గౌడ్, వైస్‌చైర్మన్ తాండ్ర లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్కపెల్లి లక్ష్మణ్, డైరెక్టర్లు, ఆర్ఐ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.