నెన్నెల : మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్ ఎం. జ్యోతి ప్రియదర్శిని మంగళవారం రాత్రి ఇంట్లో
గుండె పోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం నెన్నెల కు వచ్చిన ఆమె కార్యాలయం సబ్బందితో సమావేశం అయ్యారు. భూభారతిలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన సక్రమంగా చేయాలని సూచించారు. సిబ్బంది పనితీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేసారు. పనితీరు మార్చుకోవాలి అని సూచించారు.
ఇక్కడ పనిచేయడానికి ఎవరు సాహసించడం లేదని ప్రతి అధికారిపై పని ఒత్తిడి, దళారులతో ఫోన్లు చేయించడం ఎక్కువ అయ్యిందని సిబ్బంది అన్నారని తెలిసింది. సిబ్బంది, కింది స్థాయి అధికారులు ఎవరు సహకరించక పోవడం ఒకింత ఒత్తిడికి గురయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన తహసీల్దార్ లు ఏడు గురు వివిధ విషయాలలో సస్పెండ్ కు గురయ్యారు. ఈమె ఒత్తిడికి గురయ్యి గుండె పోటుతో మృతి చెందినట్లు మండలంలో చర్చించుకుంటున్నారు. ఇక్కడ పని చేయడానికి ఎవరు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.