Karimnagar | కమాన్చౌరస్తా, మార్చి 9 : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో టీమిండియా టీ-20ఐ వరల్డ్ కప్ గెలవడంపై విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులతో సంబురాల్లో పాల్గొన్నారు.
అనంతంర ఆయన మాట్లాడుతూ, టీం ఇండియా టీ-20ఐ వరల్డ్ కప్ గెలవడం చాలా చారిత్రాత్మకమని, క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనదని పేర్కొన్నారు. సమష్టి కృషితో వరల్డ్ కప్ గెలుచుకోవం మంచి విషయమని, కలిసి కట్టుగా పోరాడితే గెలుపు సాధ్యమని చెప్పారు. సంబరాలలో భాగంగా టీమిండియాకు విద్యార్థులు కేరింతలతో శుభాకాంక్షలు తెలియపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.