చిత్రకళాకారుడికి గవర్నర్ ప్రశంసలు
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్శుక్లా ప్రశంసించారు.లోక్‌భవన్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్‌లో నకాశీ మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎట్‌హోమ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను గవర్నర్ శివప్రతాప్శుక్లా, ఆయన సతీమణి జానకిశుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు.
చేర్యాల, ఆగస్టు 15: తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్శుక్లా ప్రశంసించారు.లోక్‌భవన్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్‌లో నకాశీ మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎట్‌హోమ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను గవర్నర్ శివప్రతాప్శుక్లా, ఆయన సతీమణి జానకిశుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు.
నకాశీ చిత్రకళలోని కళాత్మకత, ప్రత్యేకతలకు గవర్నర్ ముగ్ధులై నకాశీ కళాకారుడు దనాలకోట రాకేశ్‌ను అభినందించారు. నకాశీ కళలోని ప్రత్యేకతలు, మాస్క్‌ల తయారీ విధానం, వాటి వెనుక ఉన్న కళా సంప్రదాయాల గురించి రాకేశ్ గవర్నర్ దంపతులకు వివరించారు. తన తండ్రి ప్రముఖ నకాశీ కళాకారుడు దనాలకోట వైకుంఠం నుంచి కళను నేర్చుకున్నట్లు తెలిపారు. 2024లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్‌లో చేర్యాలకు చెందిన దనాల కోట వైకుంఠం ప్రతిభను, దశాబ్దాల నకాశీ కళను పరిరక్షిస్తున్న తీరును ప్రశంసించారని తెలిపారు.
లోక్‌భవన్ దర్బార్ హాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా బతుకమ్మ, రామాయణం, కృష్ణలీలలు, గ్రామీ ణ మహిళల జీవన దృశ్యాలు, వినాయక జననం తదితర ఇతివృత్తాలతో రూపొందించిన నకాశీ చిత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చేర్యాల నకాశీ చిత్రకళను తెలంగాణ జానపద కళా సంపదలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్‌తో పాటు ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిశోర్, సంయుక్త కార్యదర్శి శశీకరణాచారి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

