ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇవ్వడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళితులు సంబురాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ట మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు నేడు పరిష్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమవుతుందని చేసిన పోరాటానికి నేడు ఫలితం లభించిందన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్స్, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఉపకులాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు.