గంగాధర, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. శనివారం గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ స భకు రావాలని దండోరా వేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ మహాకుంభమేళాను తలపించాలని ఆకాంక్షించారు.
చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మం డలాల నుంచి 10వేల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేటి ఉదయం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి సభ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సమయన్వయంతో పనిచేసి లక్ష్యం మేరకు జనాన్ని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.