చొప్పదండి, జూలై 25 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. 420దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం చొప్పదండి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్పా రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలేదని ఎద్దేవా చేశారు. 420 హామీలు ఇచ్చి నెరవేర్చనందున కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్పా.. ఏ ఒక నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బోయినపల్లి మండలంలో కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తే.. అవి ఎక్స్పైర్ అయ్యాయంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కిట్లకు 2028 వరకు ఎక్స్పైర్ డేట్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను గడపగడపకూ వివరించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సొసైటీ అవార్డు అందుకున్న సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, గడ్డం చుక్కారెడ్డి, మాజీ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, నాయకులు మాచర్ల వినయ్, నలుమాచు రామకృష్ణ, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.