Sundaragiri Temple | చిగురుమామిడి, మే 12: మండలంలోని సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చోల్లేటి శంకరయ్య, పాలకవర్గ సభ్యులుగా గందె రాజయ్య, పూల లచ్చిరెడ్డి, బూర వీరేశం, దుబ్బాల శ్రీనివాస్, జీల సంపత్, ఎలగందుల శారద, శేషం నరసింహచార్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం చైర్మన్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, నాయకులు చిట్టిమల్ల రవీందర్, ఓరుగంటి భారతీదేవి, కాటం సంపత్ రెడ్డి, పోటు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.