Peddapally | జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యను అందించాలి.. టీయూడబ్ల్యూజేహెచ్-143 జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకరి ప్రకాష్
పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ విజ్ఞప్తి చేశారు.
Peddapally | పెద్దపల్లి, జూలై 27 : పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ విజ్ఞప్తి చేశారు. టీయూడబ్ల్యూజే హెచ్-143 ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 500 మంది వరకు అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని, మరో 200 వరకు నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. కాగా వారి పిల్లలందరికీ రాయితీపై విధ్యను పొందే అవకాశం కల్పించాలని కోరారు. గతంలో జర్నలిస్టుకు ఉన్న ఇద్దరు పిల్లలు ఒకరికి పూర్తి ఉచితంగా మరొకరికి 50శాతం రాయితీ విద్యను అందించారని, కానీ ఈ ఏడాది జర్నలిస్టుకు ఉన్న ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే అవకాశాన్ని పరిశీలించాలని వారు కోరారు.
జర్నలిస్టుల విజ్ఞప్తిని సావదాణంగా ఆలకించిన జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల పిల్లలకు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కోయ శ్రీహర్ష జర్నలిస్టుల అక్రిడేషన్ తో పాటు, జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండడం పట్ల జర్నలిస్టుల తరపున జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే గత రెండు విడతలుగా 450 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించారని, ఇంకా మిగిలిన ఉన్న జర్నలిస్టుల పట్ల సైతం కలెక్టర్ సానంబుద్ధితో ఉండటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలోని వందకు వందశాతం అర్హత గల జర్నలిస్టులందరికి అక్కడేషన్ కార్లు ఇచ్చుకునే అవకాశం రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తిర్రి తిరుపతి గౌడ్, కత్తెర్ల తిరుపతి యాదవ్, అర్కుట మల్లేష్ యాదవ్, కొయ్యడ తిరుపతి యాదవ్, మేకల సంతోష్, చేగొండ రవి కుమార్ యాదవ్, మాచర్ల వంశీ, తిర్రి సుధాకర్ గౌడ్, సుంకే రాజు, నల్లపు తిరుపతి, మార్పాక అంజి, తూర్పాటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

