SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
పాఠశాలలో నిర్వహించిన LIP బేస్ లైన్, మిడ్ లైన్,ఎండ్ లైన్ రిపోర్టులను పరిశీలించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ప్రగతిని తెలుసుకున్నారు. రాబోయే పదో తరగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని చదవాలని, విద్యార్థులు భాష పైన పట్టునుపెంచుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపాధ్యాయుల సలహాలను స్వీకరించాలని చెప్పారు. అనంతరం NMMS సాధించిన శివతేజ్ ను అభినందించారు.