Dharmaram | ధర్మారం, నవంబర్ 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎంఈవో ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం నిత్యజీవితంలో సైన్స్ విషయాలను పరిశీలిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే విధంగా కొత్త అన్వేషణలను చేయాలని సూచించారు.
జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రతీ సంవత్సరం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొంది జిల్లా స్థాయికి అర్హత పొందారు. టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయికి అర్హత సాధించిన విజేత విద్యార్థులతో పాటు ఈ పోటీలకు హాజరైన విద్యార్థులకు ఎంఈవో ప్రభాకర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు మాధవి లత, సైన్స్ ఉపాధ్యాయులు ఎస్ కృష్ణ మోహన్, రాజు నాయక్, శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.