పది ఫలితాల్లో ట్రినిటీ హవా
పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు.
పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. విద్యాసంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలోని ట్రినిటీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి, అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థలకు చెందిన 353 మంది పరీక్షలు రాశారని, మొత్తం వందశాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పీ జ్యోతిర్మయి (588), ఓ ఆరాధ్య (586), ఎం శ్రీచైత్ర (584), కే హరిణి (582), జీ నితిక్ష (582), బీ నవ్యశ్రీ (581), వై యశ్వంత్ రుషి (581), ఎం శ్రీహర్షవర్ధన్ (580), డీ శ్రీకర్ (580) మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారని తెలిపారు.
మొత్తం పది మంది విద్యార్థులు 580కుపైగా మార్కులు, 39 మంది 570కుపైగా మార్కులు, 82 మంది 560కుపైగా మార్కులు, 117 మంది 550కుపైగా మార్కులు పొందారని తెలిపారు. ట్రినిటీ విద్యాసంస్థల్లో క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమవుతుందడానికి తమ విద్యార్థులు ఫలితాలే నిదర్శమన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

