కమాన్చౌరస్తా, ఏప్రిల్ 22: ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అభినందన సభకు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తే సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని చెప్పడానికి నేటి ఫలితాలే నిదర్శమన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషితోనే ఇలాంటి ఘన విజయాలు సాధ్యమని తెలిపారు.
ఇంటర్మీడియట్ సెకండియర్ బైపీసీలో జే అంజ న 997 మారులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని నరేందర్రెడ్డి తెలిపారు. కళాశాలకు చెంది న 11మంది విద్యార్థులు 990, ఆపై మారులు సాధించడం గర్వంగా ఉన్నదన్నారు. అలాగే, ఎంపీసీలో కే రుత్విక్ 996 మార్కులతో రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలిచాడన్నారు. పీ శ్రీనిత్యరెడ్డి 995, ఎం రుత్విక 995, ఏ లక్ష్మీప్రసన్న 995, ఎస్ సేవిత 994, వీ ఋషికేష్ 994, ఎం అక్షత 994, వీ సాహితీ 994, ఎస్ కార్తికేయ 994, జీ లక్ష్మీప్రసన్న 994, కే వర్షిణి 994, ఎం కీర్తి 994 మారులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారన్నారు. 128 మంది విద్యార్థులు 990 పైన మారు లు సాధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే, తమ కళాశాలలకు చెందిన 2,293 మంది విద్యార్థులు 900 ఆపై మారులు సాధించడం ఒక మైలు రాయి అని చెప్పుకొచ్చారు. ఎంఈసీ విభాగంలో వీ అక్షయ్వర్థన్ 988, వీ రిషీత 988 మారులు సాధించారని, సీఈసీలో బీ గ్రీష్మ 987 మారులు సాధించినట్లు చెప్పారు.
ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో మొత్తం 20మంది విద్యార్థులు 468 మారులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. ఎస్ లహరి, హప్సహస్నాన్, తహూరా నూర్, టీ అన్వితరెడ్డి, సీహెచ్ అమటౌరాజ్, పీ కిర్తిశ్రీ, జే ప్రసూనాశ్రీ, ఎన్ కృష్ణవేణి, జీ తరుణ్, డీ నాగసాగర్, జే ప్రణవ్జ, జీ సూర్యప్రకాశ్, ఏ శశివర్దన్రెడ్డి, ఎల్ హాసిని, ఎం శ్వేత, కే పల్లవి, కే అనుపమ, ఏ నిచిత, జి తరుణ్, జీ లక్ష్మిప్రియ 468మార్కులు సాధించారన్నారు. 66మంది విద్యార్థులకు 467 మారులు వచ్చాయన్నారు. బైపీసీలో నభిలాతరీమ్కు 438, జోహ మహవీష్ 438, సామాపిరదోష్ 438 మారులు సాధించారన్నారు. పది మంది విద్యార్థులు 437 ఆపై మారులు సాధించారన్నారు. ఎంఈసీలో ఆర్ చిద్విలాస 491, బీఈసీలో పీ భవజ్ఞ 493 మారులు సాధించారని తెలిపారు.