చిగురుమామిడి, జూన్ 5: ఎన్ఎమ్ఎమ్ఎస్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రేకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కండె సహస్ర, బొమ్మనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొండబత్తిని సాక్షిత, ముల్కనూర్ మోడల్ స్కూల్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిరని కావ్య శ్రీ మెరిట్ స్కాలర్షిప్లో ప్రతిభ కనబరిచారు.
వీరికి ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు 48 వేల రూపాయలు పొందు తారు. వీరి ఎంపిక పట్ల రేకొండ, బొమ్మనపల్లి ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, లక్ష్మణరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్, సర్పంచులు అల్లేపు సంపత్, కొంకట మౌనిక, సాంబారి భారతమ్మ కొమురయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.