ఎల్లారెడ్డిపేట/ పెద్దపల్లి రూరల్, ఆగస్టు 8: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దాడులు చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కరిచేస్తున్నాయి. పిల్లలనైతే మరీ వెంటాడుతున్నాయి. గురువారం ఎల్లారెడ్డిపేటో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి.
అలాగే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్లో ఆడుకుంటున్న బాలుడిని కరువగా.. పెద్దపల్లి మండలం భోజన్నపేటలో స్వైర విహారం చేశాయి. పనులపై బయటికి వెళ్తున్న నలుగురిపైకి ఎగబడి మరీ కరిచాయి. పశువులను గాయపరిచాయి. దీంతో ఆయాచోట్ల ప్రజలు భయపడిపోయారు. అధికారులు దృష్టి సారించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.