Odela | ఓదెల, మే 25: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా శానగొండ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లెలో గోడకూలి గొర్రెల కాపరి ఒల్లాల లక్ష్మయ్య మృతి చెందాడు.
రూపు నారాయణపేట గ్రామంలో గాలివానకు పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కాగా గోడలు ధ్వంసమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొంత మేరకు నష్టం జరిగింది. రైతులు ధాన్యం కుప్పలపై పరదాలకు కప్పుకొని పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.