MLA CH Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 26 : హన్మాన్ విగ్రహం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జతారలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుర్కలమద్దికుంట గ్రామ ప్రజల ఆకాంక్షమేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దశల వారిగా కృషి చేస్తానన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పించే విదంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోగు రాజయ్య యాదవ్ , ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి, నాయకులు ముత్యాల నరేష్ ముదిరాజ్, ఎనగందుల ప్రదీప్ కుమార్, నవీన్ యాదవ్, పలువురు జాతర కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.