ఆడబిడ్డల ఆశీస్సులుండాలి
మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ఆడబిడ్డల ఆశీస్సులుండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.
- అభివృద్ధిలో మార్పును గమనించాలి
- యువతకు అండగా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
తిమ్మాపూర్, అక్టోబర్22 : మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ఆడబిడ్డల ఆశీస్సులుండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. ఆదివారం రామకృష్ణకాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పాల్గొన్నారు. మహిళలతో ముచ్చటించారు. గతంలో ఉన్న అభివృద్ధికి, ఇప్పటికి తేడా వివరించారు.
మార్పును ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు. యువతకు అన్ని విధాలుగా అండగా ఉండేది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. రసమయి బాలకిషన్ గెలుపు కోసం యువత దోహదపడాలన్నారు. తనను ఆశీర్వదించాలని ఆడబిడ్డలను రసమయి బాలకిషన్ కోరారు. బీఆర్ఎస్ నాయకుడు సిరికొండ అంజన్‌రావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్‌రావు, సర్పంచ్ మీసాల అంజయ్య, ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్య, సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్రణీత్‌రెడ్డి, నాయకులు దావు సంపత్‌రెడ్డి, పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

