SFI | పెద్దపల్లి టౌన్ జూన్ 14 : తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ గత ఏడాదిన్నరగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యా శాఖకు మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ప్లీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నెత్తి నోరు కొట్టుకున్న విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఉంటున్న విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలని, బస్ ఛార్జీలు తగ్గించాలని, విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లెల్ల ప్రశాంత్, ఆర్ల సందీప్, నాయకులు సూరజ్ సురేష్ నరేష్ శివ, చంద్రకాంత్ గణేష్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.