దళిత కుటుంబాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం పేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
- దళిత బంధు యూనిట్ ప్రారంభం
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 25: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం పేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన కనుకుంట్ల లక్ష్మి-పోచాలు దంపతులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారుకు పూజలు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎంఆర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆయా పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చుంచు సదయ్య, ఉపసర్పంచ్ మాదాసి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇండ్ల రమేశ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఇండ్ల మహేందర్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

