Thandriyala | కథలాపూర్, ఆగస్టు 6 : కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108 కు ఫోన్ చేశారు. కాగా వారు గ్రామానికి వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ లోనే డెలివరీ చేశారు. మూడో సంతానంలో ఆడబిడ్డకు జన్మనివ్వగా బిడ్డ బరువు రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు ఉంది. ఈ సందర్భంగా 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది సతీష్, వినోద్ పాల్గొన్నారు.