కమాన్చౌరస్తా, ఆగస్టు 9 : కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ అటనామస్ కళాశాల కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కరీంనగర్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) శాఖతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ, ఐపీపీబీ తెలంగాణ సరిల్ చీఫ్ మేనేజర్ భాసర్ నాయక్ ఆధ్వర్యంలో కామర్స్ విభాగాధిపతి టీ రాజయ్య, కరీంనగర్ ఐపీపీబీ బ్రాంచ్ మేనేజర్ తొర్తి రమేశ్ అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం బదిలీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అవగాహన ఒప్పందం ద్వారా కళాశాల బీకాం బీబీఏ, బీకాం ఫైనాన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్ విద్యార్థులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 1 నుంచి 6 నెలల వరకు ఇంటర్న్షిప్ సదుపాయం, పోస్టుల భర్తీ విషయంలో విద్యార్థులకు ప్రాధాన్యత, క్షేత్రస్థాయి పర్యటన అవగాహన సదస్సులు, తదితర ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడ మేనేజర్ కొలగూరి రేవతి, బ్యాంక్ ప్రతినిధి రమేశ్, అధ్యాపకులు మల్లారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, హర్ జ్యోత్ కౌర్, బూర్ల నరేష్, అర్జున్, శిరీష, అరవింద్, నర్మద, రాములు, మల్లేశం, ఐలయ్య, పూర్ణచందర్, అభిలాష్, విద్య ఉన్నారు.
నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కమాన్చౌరస్తా, ఆగస్టు 9 : ఉమ్మడి జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.inలో ఈ నెల 24 వరకు అప్లయ్ చేసుకోవాలన్నారు. ఎంపికైన 100 మందికి హైదరాబాద్లోని కుషాయిగూడలో ఎలీ హోప్ టెక్నికల్ సిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేరొన్నారు.
శిక్షణ తర్వాత అకాడమీ వారే ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో ఒకో అభ్యర్థికి నెలకు రూ. 4 వేల చొప్పున భృతిని అందిస్తుందన్నారు. పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలన్నారు. వివరాలకు 0878 2268686లో సంప్రదించాలని చెప్పారు.