కరీం‘నగరానికి’ చెందిన కట్ట శ్రీవల్లి అరుదైన ఘనత సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హెచ్‌సీఏ జట్టు తరపున ఫాస్ట్ బౌలర్‌గా ఎంపిక కాగా, వచ్చే నెల 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బరిలోకి దిగబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కొత్తపల్లి, నవంబర్ 17 : కరీంనగర్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సీనియర్ మహిళల వన్డే క్రికెట్ జట్టులో చోటు సంపాదించిం ది. జిల్లా కేంద్రంలోని శ్రీపురంకాలనీకి చెందిన కట్ట ఉమారాణి లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కూతు రు శ్రీవల్లి ఫాస్ట్‌బౌలర్‌గా జాతీయ క్రికెట్ పో టీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టుకు(హెచ్‌సీఏ) ఎంపికైంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు హె చ్‌సీఏ క్రికెట్ పోటీల్లో తన ఫాస్ట్ బౌలింగ్‌తో అత్యధిక వికెట్లుతీసి మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సమావే శం అనంతరం తుది జట్టును ప్రకటించగా, అం దులో శ్రీవల్లి ఎంపికైంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో డిసెంబర్4న జరగనున్న మహిళల వన్డే క్రికెట్ టీంలో హెచ్‌సీఏ హైదరాబాద్ జ ట్టుకు ఫాస్ట్‌బౌలర్‌గా ఆడనుండడం విశేషం. ఈ సందర్భంగా శ్రీవల్లిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రి కెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీ ఆగం రావు, ఎన్ మురళీధర్‌రావు, ఉపాధ్యక్షులు పీ మనోహర్ రావు, కే మహేందర్ గౌడ్, కోశాధికారి డీ శ్రవణ్ కుమార్, కోచ్‌లు డీ శ్రీనివాస్, శ్రావణ్, కిరణ్, వరుణ్ అభినందించారు.