Siricilla | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 26: తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానాన్ని శ్రీశ్రీ దేవానంద జీయర్ స్వామి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఇటీవలే ఘనంగా స్వామివారి బ్రహోత్సవాలు నిర్వహణ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మిరాజం, బీఆర్ఎస్ మాజీ మండల అంకారపు రవీందర్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, ఫ్యాక్ట్స్వస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, అంకారపు అనిత, గజభీంకార్ సంతోష్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం, ఎడమల హనుమంతరెడ్డి, సామల రమేష్, బండి చైతన్య, ఆసాని జనార్ధన్ రెడ్డి, రెడ్డి రాజశేఖర్, చొప్పదండి ప్రసాద్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.