Adluri Laxman Kumar | ధర్మారం, మార్చి 27: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మారం, ఖిలావనపర్తి, కమ్మర్ ఖాన్ పేట, బుచ్చయ్యపల్లి గ్రామాలలోని శ్రీ రామాలయాలలో ఈ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్మారంలో ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు పూస్కురు పద్మజ జితేందర్ రావు, ఖిలావనపర్తి గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి అశోక్ రావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో వేద పండితులు సీతారామ కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ధర్మారంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ను ఆలయ ధర్మకర్తలు పద్మజ జితేందర్ రావు సన్మానించారు. ఖిలా వనపర్తి గ్రామంలో జరిగిన వేడుకలకు నంది మేడారం ప్యాక్స్ మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి హాజరయ్యారు.