కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. పల్లెలు, పట్టణాల్లోని ఆలయాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా అలకంరించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మసీదులు, చర్చిల ను ముస్తాబు చేసి, ప్రార్థనలు చేశారు. మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జీవీ రా మకృష్ణారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హోమంలో పాల్గొన్నారు.
నియోజక వర్గంలో 21 మంది అర్చకులకు ధూపదీప నైవేద్య పథకం కింద నియామక పత్రాలను అందజేశారు. కొండగట్టు హనుమాన్ సన్నిధానంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూజలు చేశారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత ప్రదర్శన, నృత్యాలు, అన్నమయ్య కీర్త నలు, కూచిపూడి నృత్యాలు, భక్తి గీతాలాపన వంటి సాం స్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. చొప్పదండి నియెజకవర్గంలోని 26 ఆలయాల అర్చకులకు ధూపదీప నైవేద్య మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇల్లందకుంట సీ తారామచంద్రస్వామి ఆలయంలో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో 25 మంది అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద మంజూరైన ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఆలయంలో దేవాదాయ ధర్మదాయ శాఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం చెల్పూరు అతి పురాతన శివాలయంలో కౌశిక్ పూజలు చేశారు. కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పోతో కలిసి దర్శించుకున్నారు.