కరీంనగర్ కార్పొరేషన్, మే 17 : నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలోని ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రి, ప్లాస్టిక్ డబ్బాలు, రేకులు, పుస్తకాలు, పేపర్లు, దుస్తులు, వట్టలు, చె ప్పులు, షూలు, తదితర వస్తువులు సేకరించి రీ యూజ్, రీైస్లెకింగ్ చేయడమే లక్ష్యంగా ‘మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ్ షహర్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి డివిజన్, వార్డుల్లో తాత్కాలికంగా త్రిబుల్ ఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. నిరుపయోగంగా ఉన్న వస్తువులను పారిశుధ్య కార్మికులు సేకరించి ఈ సెంటర్లకు తరలిస్తారు. గృహాల నుంచి సేకరించే వస్తువులకు దాని డిమాండ్‌కు అనుగుణంగా యజమానులకు డ బ్బు చెల్లిస్తారు. అలాగే, త్రిబుల్ ఆర్ కేంద్రాల వద్ద నిరుపయోగ వస్తువులను తీసుకువచ్చిన సిబ్బందికి కూడా డబ్బులు ఇస్తారు. ఎవరైతే ఎకువ వస్తువులను త్రిబుల్ ఆర్ కేంద్రాలకు కలెక్ట్ చేసి ఇస్తారో అందులో ఇద్దరిని ఎంపిక చేసి వారిని నగరపాలక సంస్థ ద్వారా సత్కరిస్తారు. ఓరల్‌గా కలెక్ట్ చేసిన త్రిబుల్ ఆర్ కేంద్రాల వివరాలను ఆన్లైన్లోనే కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తారు. వీటి ఆధారంగా అత్యధికంగా కలెక్ట్ చేసిన మున్సిపాలిటీలకు ఢిల్లీలో అవార్డులు ఇవ్వడంతో పాటు సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తే మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్లో మార్కులు కేటాయించనున్నారు.
దృష్టి పెట్టిన అధికారులు
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో 15 రోజుల పాటు సాగనున్న ‘మేరా లైఫ్ మేరా స్వచ్ఛ్ షెహర్’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లల్లోనూ 60 త్రిబుల్ ఆర్ కేంద్రాలను ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఉన్నతాధికారులు పారిశుధ్య విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి డివిజన్‌లోనూ మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి ఈ తాత్కాలిక త్రిబుల్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా కేంద్రాల నుంచి వచ్చిన నిరుపయోగ వస్తువులను రీయూజ్, రీైస్లెకింగ్ చేసే సంస్థలకు అప్పగించనున్నారు. కేంద్రాల ఏర్పాటుతో పాటు మెప్మా, పారిశుధ్య విభాగం సిబ్బంది సమన్వయం చేసుకొని ప్రతి డివిజన్లోని ఇం టింటి నుంచి నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించేలా అవగాహన చర్యలు చేపట్టాలని కూ డా ఆదేశాలు జారీ చేశారు. త్రిబుల్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే వారిని మరో రెండు రోజుల్లో గుర్తించి ఈ నెల 20న అన్ని డివిజన్లలోనూ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీని వల్ల ఇళ్లల్లో నిరుపయోగ వస్తువులు ఉండకుండా, చెత్త చెందారం పేరుకపోకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవంతానికి చర్యలు
మేరా లైఫ్ మేరా స్వచ్ఛ్ షహర్‌ను విజయవం తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని డివిజన్లలో త్రిబుల్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేశాం. అలాగే, ప్రతి ఇంటి నుంచి నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించేలా పారిశుధ్య సిబ్బందికి అవగాహన కల్పించడంతోపాటు మహిళా సంఘాలను సైతం భాగస్వా మ్యులను చేస్తున్నాం. వేసవి సెలవుల్లో పిల్లలు, యువత ఇళ్లల్లోనే ఉండే అవకాశం ఉన్నది. వీరిలోనూ అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తాం.
– వై సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
విస్తృతంగా ప్రచారం
ఈ కార్యక్రమంపై నగర వాసులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బల్తియాలోని అన్ని విభాగాలను ఇందులో భాగస్వామ్యులను చేస్తాం. డివిజన్లలో తాత్కాలికంగా త్రిబుల్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వస్తువులను అక్కడి నుంచి వివిధ సంస్థలకు తరలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రీయూజ్, రీఫ్యూజ్, రీైస్లెకింగ్కు ఉపయోగపడే అన్ని వస్తువులను సేకరించి ఆయా యజమానులకు దానికి అనుగుణంగా డబ్బులు అందించడంతో పాటు సేకరించిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
-సేవా ఇస్లావాత్, కరీంనగర్ బల్దియా కమిషనర్