Valgonda Trikutalayam | మల్లాపూర్, జూలై 2 : గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు అన్నారు. ఆయన ఆలయంతో పాటు, గోదావరి నదిని గురువారం పరిశీలించి ఆలయ చరిత్ర, కట్టాడాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంకు ఎంతో చారిత్రాత్మక ఉందని, పలు సాహితి పుస్తకాలు, గ్రంథాల్లో సైతం ఆలయ విశిష్టత ఎంతో ప్రాముఖ్యంగా ఉందని స్పష్టం చేశారు.
రాబోయే గోదావరి పుష్కరాల లోపు ఆలయంను అభివృద్ధి చేసేలా ప్రత్యేక కార్యచరణ తీసుకుంటామాని తెలిపారు. అనంతరం అధికారులను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్, సర్పంచులు తోపారపు వసంత, దరంసోత్ సురేందర్ నాయక్, ఉపసర్పంచులు వెంకటస్వామి, శ్రీనివాస్, ఆలయకమిటీ చైర్మన్ సాంబారి శంకర్, నాయకులు ఎండీ జమాల్, క్యాతం నరేష్ రెడ్డి, పందిరి నాగరాజ్, లక్ష్మీనర్సయ్య, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.