Road accidents | పెగడపల్లి: పెగడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద గల మూలమలుపులో వాహనాల వేగ నియంత్రణకు గాను శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, అతి వేగంతో పాటు, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, మైర్లకు వాహనం ఇవ్వడం చట్టరీత్యా నేరమని, వాహనాలు నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితితుల్లోనూ మద్యం సేవించరాదని ఎస్సై స్పష్టం చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ కేడ్లను ఏర్పాటు చేస్తామని, అలాగే నేరాల నియంత్రణకు రాత్రిళ్లు పెట్రోలింగ్‌తో పాటు, అన్ని ముఖ్య కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఎస్సై కిరణ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చంద్రశేఖర్, శ్యాం ఉన్నారు.