Special Kumkumkarchana | ధర్మారం, సెప్టెంబర్ 26: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని పరివార సమేత శ్రీ దుర్గాభవాని దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజైన శుక్రవారం శ్రీ దుర్గా దేవికి విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు తోవిటి అభిరామ్ ఆలయ నిర్వాహకులు నూతి విజయ లక్ష్మి, శ్రీకారాచారి, శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారం ఎత్తగా దుర్గాదేవి విగ్రహం వద్ద కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో మహిళలు అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయం తరఫున తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.
నర్సింగాపూర్ లో..
దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాయల్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారి అలంకారం సందర్భంగా కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళా మణులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కుంకుమార్చన మహిళలు వేడుకున్నారు. కార్యక్రమంలో భవాని మాల దీక్ష పరులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.