Peddapally | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 20 : పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య శనివారం సందర్శించి పరిశీలించారు.
గ్రామ పరిసరాలను కలియ తిరిగిన డీపీవో గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి అధికారులు, సిబ్బంది హాజరు శాతం సిబ్బంది వేతన చెల్లింపులు, గ్రామ అవసరాలకు వెచ్చించిన నిధులు, తీర్మాణాలు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
మోబైల్ యాప్ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని ఎలాంటి నిర్లక్ష్యదోరణి ప్రదర్శించినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి అశోక్ తదితరులున్నారు.