Special attention | సారంగాపూర్, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బందితో పనులు చేయించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శులను ఆదేశించారు.
అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా పంపిణీ చేయాలని అన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మాణం చేసుకునేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధిహామీ ద్వారా ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటించాలని వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీవో మహ్మద్ సలీం, ఏపీవో శ్రీలత, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.