Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 19 : ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (ఆత్మ), చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారి శత్రు నాయక్, ఎంపీడీవో రామ్మోహన్ చారి అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్స్ పంపిణీ మొదలు అంశాలపై ప్రధానోపాధ్యాయురాలు పావనితో మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పట్ల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధచూపి 100శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేయాలని అన్నారు. వీరి వెంట హెచ్ఎం పావని, ఉపాధ్యాయులు ఉన్నారు.