Belgium | మురికి కాలువ శుభ్రం చేస్తుండగా బయటపడ్డ బంగారు కడ్డీలు, అరుదైన నాణేలు.. విలువ రూ.98 కోట్లు
Belgium : బెల్జియంలో అరుదైన ఘటన జరిగింది. ఒక మురికి కాలువలో కార్మికులు శుభ్రం చేస్తుండగా అత్యంత ఖరీదైన బంగారు కడ్డీలు, అరుదైన నాణేలు లభించాయి. వాటి విలువ రూ.98 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటన ఇటీవల బెల్జియం, బ్రస్సెల్స్ సమీపంలోని డెండర్మోండో ప్రాంతంలో జరిగింది.
Belgium : బెల్జియంలో అరుదైన ఘటన జరిగింది. ఒక మురికి కాలువలో కార్మికులు శుభ్రం చేస్తుండగా అత్యంత ఖరీదైన బంగారు కడ్డీలు, అరుదైన నాణేలు లభించాయి. వాటి విలువ రూ.98 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటన ఇటీవల బెల్జియం, బ్రస్సెల్స్ సమీపంలోని డెండర్మోండో ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక బిల్డింగు వద్ద పునరుద్ధరణ, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కార్మికులు ఒక మురికి కాలువలో దిగి పని చేస్తుండగా, వారికి మొదట కొన్ని నాణేలు లభించాయి. అవి 1 యూరో నాణేలు.
ఇవి చాలా పాతకాలం నాటివి అయినప్పటికీ సాధారణమైనవే అని భావించారు. అలా కాలువలో తవ్వుకుంటూ వెళ్తుండగా మరిన్ని నాణేలు దొరికాయి. అలాగే, భారీ ఎత్తున బంగారు కడ్డీలు కూడా లభించాయి. 49 పెద్ద బంగారు కడ్డీలు, బకెట్ నిండా బంగారు నాణేలు, ఇతర అరుదైన నాణేలు లభించాయి. ఇలా భారీ నిధి బయటపడటంతో అక్కడి మేనేజర్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ బంగారు నిధిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ గదికి తరలించి, తాళం వేశారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నిధికి సంబంధించిన ఫొటోల్ని పోలీసులు, స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. వాటి అన్నింటి విలువ రూ.98 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ నిధులు దొరికిన బిల్డింగ్ సీఏడబ్ల్యూ ఊస్ట్-వ్లాండెరెన్ అనే చారిటీ సంస్థకు చెందిందని అధికారులు అన్నారు.
ప్రస్తుతం ఇక్కడ నిధి దొరికింది అనే సమచారం బయటకు రావడంతో ఈ ప్రాంతంలో ఇతరులు తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతం చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక్కడ ఎవరూ తవ్వకాలు చేపట్టకూడదని, లోపలికి అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్మాణ స్థలం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

