కరీంనగర్ కలెక్టరేట్, మే 12 : పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సోమవారం జరుగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏ ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.