Home
Karimnagar
Sp Akhil Mahajan Congratulated The Constable Who Performed Cpr And Saved The Womans Life
శభాష్.. శ్రీనివాస్
తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయింది.
- సీపీఆర్ చేసి మహిళా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
- అభినందించిన ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల తెలంగాణ చౌక్, మే 25: తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అటుగా రోడ్డుపై నుంచి వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గమనించి వారి ఇంట్లోకి వెళ్లాడు.
అనూహ్యకు గుండెపోటు వచ్చిందని గుర్తించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. తర్వాత ఆమెను సొంత వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. చాకచక్యంగా వ్యవహరించి మహిళా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అఖిల్‌మహాజన్, పలువురు పోలీసు అధికారులు అభినంచారు. శ్రీనివాస్‌కు అనూహ్య కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

