Murder | ఓదెల, ఆగస్టు 4 : కొడుకు సైకోగా మారి తండ్రిని కొట్టి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మ్యాక మాదయ్య (70) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. కాగా అతడి కుమారుడు బాపూరావు బండరాళ్లతో కొట్టి చంపాడు.
కాగా బాపూరావు సైకోగా తిరుగుతాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. కాగా ఈ ఘటన సమాచారం పోలీసులకు అందగా సంఘటనాస్థలానికి పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.