Murder | రాయికల్, జూన్ 05 : మతిస్థిమితం సరిగా లేని కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన రాయికల్ మండలం మైతపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మైతపూర్ గ్రామానికి చెందిన తోట్లే ఎర్రయ్య (68)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పెద్ద కుమారుడు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎర్రయ్య భార్య సైతం 18 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. కాగా అప్పటి నుండి ఎర్రయ్య సుమితం సరిగా లేని చిన్న కుమారుడు మల్లేష్‌ను సాదుకుంటూ జీవిస్తున్నాడు. కాగా మతిస్థిమితం సరిగా లేని మల్లేష్ బుధవారం రాత్రి నుండి తండ్రిని కొడుతూ అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో విచక్షణ రహితంగా నరకడంతో ఎర్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సుధీర్రావులు పరిశీలించారు.