yellareddypeta | ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 11: మద్యం మత్తులో తండ్రితో గొడవపడి కోపోద్రిక్తుడైన తనయుడు కర్రతో మెడపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంచెపు కనకయ్య (50) తన ఇంటి ముందు కూర్చుని ఉండగా ఇంటి పక్కనే జరుగుతున్న ఓ పెళ్లి వేడుక నుంచి వచ్చిన కనకయ్య కుమారుడు పరుశరాములు మద్యం మత్తులో తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఇది విన్న కనకయ్య తల్లి రాజవ్వ మనవడిని, కొడుకుని మందలించింది.
అప్పటికే ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో పరశురాములు కోపంతో అక్కడే ఉన్న ఓ కర్రతో తండ్రి కనకయ్య పై దాడి చేశాడు. మెడపై బలంగా కొట్టడంతో కనకయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా కనకయ్యను అంబులెన్స్ లో తీసుకు వెళుతున్న సమయంలోనే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.