తెలంగాణ చౌక్, కరీంనగర్ ఏప్రిల్ 6 : న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్ చింతలపల్లి జనార్ధన్ రెడ్డి సిద్దిపేట జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు.
కాగా ఆదివారం ఆయన కరీంనగర్ కు వచ్చిన గణేష్ నగర్ లో స్నేహితులు, బంధువులు శాలువాలతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ది పేట జిల్లా న్యాయ వాదుల సమస్యల పరిష్కారం కోసం, కోర్టుల సముదాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా, న్యాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించడం కోసం కృషి చేస్తానన్నారు.
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవడం కోసం, హౌసింగ్ సొసైటీ ద్వారా గృహ నిర్మాణం, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కోసం పాటుపడుతానన్నారు. ఈ కార్యక్రమంలో ముస్కు మహేందర్ రెడ్డి, బోనగిరి మహేందర్, నిషాని రాజేందర్, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, బూడిద సదాశివ, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.